మంగళగిరి లో కమ్మ వారి సేవా సమాఖ్య-ఆంధ్ర ప్రదేశ్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ - చైర్మన్ గా ఎన్నికైన మండవ మురళీకృష్ణ

కమ్మ వారి సేవా సంఘం (PKVSS) సోషల్ మీడియా ని follow కాగలరు...

 ఈరోజు మంగళగిరి లో కమ్మ వారి సేవా సమాఖ్య-ఆంధ్ర ప్రదేశ్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో

ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం అధ్యక్షులు
శ్రీ మండవ మురళి కృష్ణ గారిని రాష్ట్ర కమ్మ వారి సేవా సమాఖ్య చైర్మన్ గా నియమించడం జరిగింది.
గౌరవ అధ్యక్షులుగా శ్రీ గన్ని భాస్కర రావు గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ కొత్త పల్లి రమేశ్ చంద్ర గారిని మరియు ట్రెజరర్ గా
శ్రీ గూడూరు కోటేశ్వర్ రావు గారిని నియమించడం జరిగింది...














ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 01_05_2025 గురువారం సాయంత్రం నిర్మల్నగర్ లోని కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ గా ఎన్నికైన మండవ మురళీకృష్ణ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని కమ్మ సంఘాలను కలుపుకుని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, ఇప్పటికే రాష్ట్రంలో 12 హాస్టల్స్ ఉన్నాయని ఈ సంఖ్య నీ పెంచుతామని అన్నారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా 4 అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందని విద్య, వైద్యం, స్వయం ఉపాధి, క్రీడలు వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని, ఎవరైతే మెరిట్ లో ఉండి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ మురళీకృష్ణ సమర్థవంతంగా సేవా కార్యక్రమాలు చేపడతారని నమ్మకంతో వారికి ఈ బాధ్యతలు పెద్దలు ఇచ్చారని, అనతి కాలంలో ప్రకాశం జిల్లా సంఘానికి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిడిపోతు వెంకటేశ్వర్లు, అలా హనుమంతరావు, కాట్రగడ్డ రఘుపతి రావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, అబ్బూరి నవీన్, నాగుబోయిన భాస్కరరావు,పావులూరి పద్మజ, వద్దెంపూడి సుజాత, మండవ సుబ్బారావు, బొడ్డపాటి వెంకట్, మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, అంగళకుర్తి నరసింహారావు, కరిచేటి చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరంలోని వివిధ సంఘాల ప్రముఖులు మురళీకృష్ణ నీ కలసి శుభాకాంక్షలు తెలిపారు...









 ఈ రోజు కృష్ణా జిల్లా మొవ్వ లో కీర్తిశేషులు బొప్పన ఆంజనేయులు గారి 101 వ జయంతి వేడుకలు లో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ గారు, గజల్ శ్రీనివాస్ గార్లతో కలసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీ కృష్ణ గారు

కార్యక్రమంలో భాగంగా తమ గ్రామ ముద్దుబిడ్డ ఇటీవల ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ గా ఎన్నికైన మండవ మురళీకృష్ణ గారిని మొవ్వ గ్రామస్తులు ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలియచేశారు...







No comments

Powered by Blogger.