1K Donor Club by Ptakasam Zilla Kamma Vari Seva Sangham (PKVSS )


   

ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం" 2024 న స్థాపించిన నాటి నుండి మరియు ఏప్రిల్ 2025లో ప్రారంభించిన “1Kడోనార్స్ క్లబ్" ద్వారా ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమములు.

* గంగినేని రమేష్ కు జీవనోపాధి నిమిత్తం 3 చక్రముల మోటారు సైకిల్ బండికి గాను చేసిన ఆర్ధిక సహాయం.    రూ.45,000/-

* మార్చి 2025 లో 6 గురు విద్యార్థుల చదువు నిమిత్తం చేసిన ఆర్ధిక సహాయం రూ. 1,10,000/-

* ఏప్రియల్ 2025 లో కబడ్డీ సబ్ జూనియర్ విద్యార్థులకు పులివెందుల వెళ్ళుటకు యిచ్చిన రవాణా ఛార్జీలు. రూ.20,000/-

* ఏప్రియల్ 2025 లో ముగ్గురు విద్యార్థులకు చదువుల నిమిత్తం ఇచ్చిన ఆర్ధిక సహాయం రూ.60,000/-

* ఏప్రియల్ 2025 లో అద్దంకి శాంతినగర్ ఆళ్ళ రామారావు గారికి జీవనోపాధి నిమిత్తం టిఫిన్ బండి ఏర్పాటుకు ఇచ్చిన సహాయం. రూ.40,000/- 

* ఒంగోలు మండలం గుడిమెళ్ళపాడులో ఆకస్మికంగా మరణించిన పొడపాటి వెంకటక్రిష్ణ కుటుంబానికి ఇచ్చిన ఆర్ధిక సహాయం. రూ.25,000/-

*కారంచేడు గ్రామానికి చెందిన కొడాలి గోపిచంద్ 2025 పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి, పేదరికంతో ఉన్నందున అతనిని CA లో గుంటూరు మాస్టర్ మైండ్స్లో చేర్పించినందుకు. రూ.50,000/-

* దుత్తలూరు మండలం, నరవాడ కు చెందిన చల్లా మధు లోకేష్ తల్లిదండ్రులను కోల్పోయినందున మన సంఘం దత్తత తీసుకుని చీమకుర్తి పబ్లిక్ స్కూల్ లో చదివిస్తున్నాము.

* కమ్మ హాస్టల్స్లో 10వ తరగతి పూర్తి చేసిన 18 మంది బాలికలను ఒంగోలు శ్రీశ్రీ ప్రతిభ కళాశాలలో ఇంటర్ చేర్పించినందుకు చెల్లించిన  ఫీజు. రూ. 5,50,000/-

* మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సిఫారసు మేరకు గుంటూరు కమ్మ హాస్టల్ నందు 11 మంది అలాగే రాష్ట్రంలోని కమ్మ హాస్టల్స్లో మరో 20 మంది హైస్కూల్ విద్యార్ధులను చేర్పించటం జరిగింది.

* ప్రతిభ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు గారి సహకారంతో ఇద్దరు విద్యార్ధులను ఉచితంగా ఇంటర్మీడియట్ చదివించడం జరుగుతుంది.

 * మన సంఘం ఆధ్వర్యంలో జూన్ 22 వ తేదీన 100 మంది విద్యార్ధుల ఫీజుల నిమిత్తం గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన రావు గారు, కాకతీయ విద్యా ట్రస్టు కార్యదర్శి శ్రీ గూడూరి సత్యన్నారాయణ గారి చేతుల మీదుగా అందించిన ఆర్ధిక సహాయం. రూ. 18,00,000/-

 * మన నిరంతర కార్యక్రమాలలో భాగంగా తేది. 24-08-2025 న బృందావనం ఫంక్షన్ హాలు ఒంగోలులో B.Tech మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు ఆర్ధిక సహాయం మరియు 25 లాప్టాప్లను అందించడం జరుగుతుంది. రూ. 16,50,000/-

ఈ కార్యక్రమాలన్నీ మీ అందరి ప్రోత్సాహం, సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఇప్పటికి మన 1K డోనార్స్ క్లబ్లో 400 మంది ఉన్నారు. మీరందరు పెద్ద మనసు చేసుకొని ఒక్కొక్కరు ఒక సభ్యుడిని చేర్పించండి. మన సంఘం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టటానికి చేయూత అందించవలసినదిగా కోరుచున్నాము.

అభినందనలతో 

మండవ మురళీకృష్ణ 

అధ్యక్షులు

ఆలా హనుమంతరావు

ప్రధాన కార్యదర్శి

పాటిబండ్ల వెంకటేశ్వర్లు

చైర్మన్ 1K డోనార్స్ క్లబ్







No comments

Powered by Blogger.