నాదెండ్ల బ్రహ్మం చౌదరి చేతుల మీదుగా 25మంది విద్యార్థులకు 10లక్షల విలువైన లాప్టాప్ లు, 6లక్షల స్కాలర్షిప్ లు

 ఈ రోజు August 24, 2025 ఉదయం ఒంగోలు నగరంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 1k డోనార్స్ సభ్యుల ఆత్మీయ సమావేశం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు పాల్గొన్నారు.

ఈ రోజు బీటెక్ మొదటి సంవత్సరం చదివే కమ్మ మరియు ఇతర వర్గాల కి చెందిన 25మంది విద్యార్థులకు 10లక్షల రూపాయలు విలువైన లాప్టాప్ లు, 6లక్షలు రూపాయలు స్కాలర్షిప్ లు అందచేశారు. ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు, చిడిపోతు వెంకటేశ్వర్లు గారు, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంత రావు గారు, 1k డోనార్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు గారు సంఘ ప్రముఖులు, కార్యవగసభ్యులు,పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మండవ మురళీకృష్ణ గారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు






















No comments

Powered by Blogger.