Tamilnadu Kammavar History in telugu - తమిళనాడు కమ్మవారి చరిత్ర, సమాచారం
తమిళనాడు కమ్మవారి చరిత్ర, సమాచారం:
తమిళనాడులో కమ్మవారి జనాభా దక్షిణ తమిళనాడు జిల్లాలు తిరునల్వేలి, తూత్తుకుడి, తేని, దున్డిగల్, విరుదునగర్ జిల్లాలలో ఎక్కువగా ఉంది. తరువాత కోయంబత్తూరు, కడలూరు, వేలూరు, తిరువన్నామలై, విల్లుపురం, మదురై, నీలగిరి, జిల్లాలు మరియు చెన్నై పట్టణంలో కమ్మవారి జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంది.
దక్షిణ తమిళనాడులో కమ్మవారి చరిత్ర:
తమిళనాడు రాష్ట్రంలో కమ్మవారి జనాభా కోవిల్పట్టి, సాత్తూరు, రాజపాల్యం, విరుడునగర్, తేని, శివకాశి, శ్రివిల్లిపుత్తూరు, దున్డిగల్ మొదలైన ప్రాంతాలలో ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కమ్మవారిని ఎక్కువగా 'నాయకర్' పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతంలో కమ్మవారు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడి కమ్మవారు మన కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాల రైతులవలె ఎక్కువగా నల్లరేగడి నేలల్లో వ్యవసాయం చేస్తూ, ప్రత్తి, పొగాకు, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారు. నీటి వసతి కలిగిన ప్రాంతాలలో చెరుకు, వరి సాగు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ ప్రాంతం ప్రత్తి పంటకు ప్రసిద్ధి చెందింది, ఈప్రాంతంలో అనేక నూలు మిల్లులు ఉన్నాయి. దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన 'జయవిలాస్' గ్రూప్, అరుప్పుకొట్టై తాలూకా, విరుదునగర్ జిల్లాలో ఉంది. కమ్మవారిలో ప్రసిద్ధి గాంచిన సాధు రామస్వామి నాయుడు ఈ గ్రూప్ వ్యవస్తాపకులు, వీరు ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించారు. వీరికి నూలు మిల్లులు, ట్రాన్స్పోర్టు వ్యాపారం మినీ పవర్ ప్లాంట్ ఉంది. వీరు తమ పరిశ్రమలలో కమ్మవారికి, ముఖ్యంగా స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి ఆర్దికభివ్రుద్ధికి తోడ్పడుతున్నారు. ఈ ప్రాంతంలో 'జయలలిత' గత మూడుసార్లు గెలుస్తూ వచ్చిన 'అందిపట్టి' నియోజకవర్గంలో కమ్మవారి జనాభా ఎక్కువ. ఇక్కడ కమ్మవారిచే స్థాపించబడిన 'రాజశ్రీ షుగర్స్' ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
ఇక్కడి కమ్మవారు మిగిలిన ప్రాంతాలవారితో పోల్చితే కొంచెం ఆర్ధికంగా వెనుకబదినవారు, అందువలన తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాంతంలో కమ్మవారిని బి.సి కులంలో చేర్చి విద్య మరియు ఉద్యోగ రంగాలలో కొన్ని రాయితీలు ఇచ్చింది. తమిళనాడులో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, మరియు ఇతర ఉన్నత పదవులలోని కమ్మవారు ఎక్కువమంది ఈ ప్రాంతంనుండి వచ్చినవారే.
ప్రముఖ రాజకీయ నాయకుడు, యం.డి.యం.కే. వ్యస్తాపకుడు, వైకో (పులిపాటి. వాయుపురి. గోపాలస్వామి) కలింగాపట్టి గ్రామం, తిరునల్వేలి జిల్లాకు చెందినవాడు. మాజీ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టీస్.కే.వీరాస్వామి, వి.రామస్వామి, అలగిరిస్వామి, జస్టీస్.చెరుకూరి.రామానుజం, కే.వెంకటస్వామి, కే.గోవిందరాజన్ మొదలైన వారు శివకాశి, శ్రివిల్లిపుత్తూరు, తేని ప్రాంతాలకు చెందినవారు. ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ దున్డిగల్ జిల్లాకు చెందినవారు. రాజశేఖర్ బావ, తమిళనాడు అడిషనల్ డి.జి.పి వి.బాలచంద్రన్ ఐ.పి.ఎస్. కుడా ఇక్కడి వారే.
ఇక్కడి కమ్మవారు మిగిలిన ప్రాంతాలవారితో పోల్చితే కొంచెం ఆర్ధికంగా వెనుకబదినవారు, అందువలన తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాంతంలో కమ్మవారిని బి.సి కులంలో చేర్చి విద్య మరియు ఉద్యోగ రంగాలలో కొన్ని రాయితీలు ఇచ్చింది. తమిళనాడులో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, మరియు ఇతర ఉన్నత పదవులలోని కమ్మవారు ఎక్కువమంది ఈ ప్రాంతంనుండి వచ్చినవారే.
ప్రముఖ రాజకీయ నాయకుడు, యం.డి.యం.కే. వ్యస్తాపకుడు, వైకో (పులిపాటి. వాయుపురి. గోపాలస్వామి) కలింగాపట్టి గ్రామం, తిరునల్వేలి జిల్లాకు చెందినవాడు. మాజీ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టీస్.కే.వీరాస్వామి, వి.రామస్వామి, అలగిరిస్వామి, జస్టీస్.చెరుకూరి.రామానుజం, కే.వెంకటస్వామి, కే.గోవిందరాజన్ మొదలైన వారు శివకాశి, శ్రివిల్లిపుత్తూరు, తేని ప్రాంతాలకు చెందినవారు. ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ దున్డిగల్ జిల్లాకు చెందినవారు. రాజశేఖర్ బావ, తమిళనాడు అడిషనల్ డి.జి.పి వి.బాలచంద్రన్ ఐ.పి.ఎస్. కుడా ఇక్కడి వారే.
తిరునల్వేలి జిల్లా:
తిరునల్వేలి జిల్లాలో కోవిల్పట్టి, కళింగపట్టి, సత్తెరపట్టి, వరహనూర్, ముక్కుట్టుమలై, ఇలరసనందల్, పులియంకలవ్, సిత్తరంపట్టి, అప్పనేరి, అయ్యనేరి, నక్కల ముత్తంపత్తి (కమ్మ క్రిస్టియన్స్ ఎక్కువ), నడువపట్టి, మైపార, సంగనట్టి, వెల్లకులవ్, ఆకరిశంకులవ్, అలమనయకర్పట్టి, వడక్కు కుర్వికులం, కురింజకులం, సుందరేశపురం, కులకట్టకురుచ్చి, వాడక్కుపట్టి, పిల్లియార్నట్టం, జమీన్ దేవరకులం, , రామలింగాపురం, తెర్కుకుర్వికులం, మలయాన్కులం, మరుదాపురం, కే.అలంగులం, నలంతుల, నడువకురుచ్చి, కులశేఖర మంగళ, అచంబట్టి, వెల్లపనేరి, తిరువెంగులం పెరురచ్చి మొదలైన ప్రాంతాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది. తిరునల్వేలి జిల్లాలో కొన్ని గ్రామాలలో (ఆలమనైకెర్పట్టి) కమ్మవారి జనాభా 90% పైగా ఉంటుంది.
తిరునల్వేలి జిల్లా, కోవిల్పట్టి తాలుకా లో తమిళనాడు కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యాలయం ఉంది. ఇక్కడ ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తుంటారు, మ్యారేజ్ బ్యూరో ఉంది. ఈ జిల్లాలో, కమ్మవారి సంఘం విశ్వనాధపేరి లో 'కమ్మవార్ హైస్కూల్' మరియు కోవిల్పట్టి లో 'కమ్మవారి బాలికల హైస్కూల్' నిర్వహిస్తున్నారు. తమిళనాడు కమ్మ మహజన సంఘం అధ్యక్షులు గెంగుస్వామి నాయుడు గారి సహకారంతో ఈ రెండు విద్యాలయాలు స్తాపించబడ్డాయి. కోవిల్పట్టి పట్టణంలో కమ్మవారి బ్యాంకు కూడా స్థాపించబడింది.
ఈ జిల్లాలో పెరియకులం పార్లమెంట్ స్థానం నుండి గతంలో ఆర్.జ్ఞానస్వామి, నారాయణస్వామి నాయుడు యం.పి గా ఎన్నికయ్యారు. ఈ జిల్లాలో గతంలో గోవిందస్వామి నాయకర్, లక్ష్మీపతి నాయకర్, రామస్వామిదాస్, అలగిరిస్వామి, వెంకటస్వామి నాయకర్, డి.కే.నాయుడు, రెంగస్వామి, డి.వేణుగోపాల్ నాయుడు, వి.కృష్ణస్వామి, అయ్యలుస్వామి, బాలకృష్ణన్, ఎస్.కే.రామస్వామి, యల్.రాధాకృష్ణన్ మొదలైనవారు యం.యల్.ఏ లు గా ఎన్నికయ్యారు. కోవిల్పట్టి ప్రస్తుత యం.యల్.ఏ, మంత్రి కదంబుర్ రాజు (ఏ.ఐ.డి.యం.కే) కమ్మవారే. కమ్మవారి జనాభా అధికంగా ఈ స్థానం నుండి గత ఆరు దశాబ్దాలుగా కమ్మవారే శాసనసభ్యులుగా ఎన్నికవుతున్నారు. విశేషమేమిటంటే ఇక్కడ అన్ని పార్టీలనుండి కమ్మవారే పోటీచేస్తుంటారు.
ఏం డి ఏం కె అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైగో (పులిపాటి గోపాలస్వామి) కోవిల్పట్టి సమీపంలోని కళింగపట్టి గ్రామానికి చెందిన భూస్వామ్య కుటుంబానికి చెందిన వారు. తెలుగు దేశం మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కోవిల్పట్టి సమీపంలోని అయ్యనేరి గ్రామానికి చెందిన వారే, ఆవిడ తండ్రి మాజీ సివిల్ సర్వీస్ అధికారి.
కోవిల్పట్టి పట్టణంలో కమ్మవారు అనేక ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఈ పట్టణంలోని డాక్టర్లలో 50% మంది కమ్మవారే. ఈ జిల్లానుండి అనేకమంది కమ్మవారు ఐ ఏ ఎస్, ఐ పి ఎస్, మరియు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలలో ఉన్నారు. ఈ సంవత్సరం ఈ ప్రాంతం నుండి ఇద్దరు కమ్మ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ కు ఎన్నికయ్యారు. కోవిల్పట్టి సమీప ప్రాంతాల్లో కమ్మవారు అగ్గిపెట్టెలు, బాణాసంచా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నారు.
జమీందారులు:
పెమ్మసాని వారు: మధుర నేలిన విశ్వనాధ నాయకుని సామంతులుగా గండికోట రాజ్య పతనం తరువాత అక్కడనుండి వలస వచ్చిన పెమ్మసాని వంశం వారు కొంత కాలం కుర్వికులం జమీ మరియు కొన్నిచుట్టు పక్క గ్రామాలను తమ ఏలుబడిలో ఉంచుకున్నారు. వీరు కృష్ణా జిల్లా వేల్పూరు గ్రామంలో వియ్యమందారు. వీరి వారసులు జమీని లీజుకిచ్చి ప్రస్తుతం కొవిల్పట్టి పట్టణంలో స్థిరపడి వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఇళయరాసనందల్
రావెల్ల/రావిల్ల వారు: మధురై నాయక రాజుల సామంతులుగా ఇళయరాసనందల్, నైకరపట్టి సంస్థానం మరికొన్ని గ్రామాలను రావెల్ల వారు తమ యేలుబడిలో ఉంచుకున్నారు. ఇప్పటికి ఇక్కడి ప్రజలు మధుర నాయక రాజుల వారసులుగా, కమ్మవారిని గౌరవవిస్తారు. ప్రస్తుతం రావిళ్ల సెల్వరాజ్ గారు జమీలోనే నివాసం ఉంటున్నారు, ఆయన సంతానం చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాలలో స్థిరపడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రావిళ్ల సెల్వరాజ్ గారు తన తండ్రి పేరుమీద రావిళ్ల కె ఆర్ ఏ విద్యాశ్రమ్ పేరుమీద కోవిల్పట్టి పట్టణంలో విశాలమైన ప్రాంగణంలో స్కూలు. కాలేజీ ఏర్పాటుచేసి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారు.
విరుదునగర్ జిల్లా:
విరుదునగర్ జిల్లాలో కమ్మవారి జనాభా శివకాశి, తిరుతంగల్, వాడపట్టి, టి.పేరురాచ్చి, సిద్దురాజపురం, విశ్వనట్ట, వెండురాయపురం, నారాయణపురం, రాజపాల్లయం, ఎల్లింగనాయకన్పట్టి, సత్రరేడ్డయ్యపట్టి, అల్లంపట్టి, కుమారలింగాపురం, విరుదునగర్, మిసలూరు, తాడంబట్టి, వండిపురి నాయకనూరు, పులియంకుల, ఎత్తిర్కొట్టై, దమ్మనాయకేన్ పట్టి, వచ్చాక్కరపట్టి, రోసల్పట్టి, సేదపట్టి, సత్తూరు, శ్రివిల్లిపుత్తూరు, కలంగపేరి, కసిరేడ్డియ్యపట్టి, ఎరిచినట్ట, కీలతిరుత్తంగల్, మంగళ, అరుప్పుకొట్టై, పాలయంపట్టి, గోపాలపురం, కంచనాయకేన్పట్టి, కొట్టిపరై, తునుకపట్టి, అప్పయ్యనాయకేన్పట్టి, పుదుపట్టి, నల్లమనాయకేన్పట్టి, మెట్టుపట్టి, నాగలాపురం, ఓమనాయకన్పట్టి, పేరయంబట్టి, కరిశాల్పట్టి, పండలకుడి, కొప్పిసిత్తంపట్టి, మొదలైన ప్రాంతాలలో ఉన్నారు.తమిళనాడులో కమ్మవారి జనాభా అధికంగా కలిగిన జిల్లాలలో విరుదునగర్ మొదటిది. ఈ జిల్లాలో శివకాశి, రాజపల్లయం, శ్రివిల్లిపుత్తూరు, సత్తూరు, అరుప్పుకొట్టై మొదలగు తాలుకాలలో కమ్మవారి జనాభా అధికంగా ఉంది. ఈ జిల్లా నుండి ఇంతవరకు అత్యధిక సంఖ్యలో కమ్మ యం.యల్.ఏలు, యం.పిలు ఎన్నికయ్యారు. శివకాశి నుండి గత ఐదు దశాబ్దాలలో రెండు సార్లు తప్ప మిగిలిన అన్ని సార్లు కమ్మవారే యం.పిలు గా ఎన్నికయ్యారు. తమిళనాడులో కమ్మవారికి బలమైన పార్లమెంటరీ నియోజకవర్గం శివకాశి.శివకాశి నుండి యం.పిలు గా ఎన్నికయ్యిన కమ్మవారు: ఆర్.రామమూర్తి, యం.సౌందరరాజన్ (మూడు సార్లు), వి.జయలక్ష్మి (మూడు సార్లు), వి.గోపాలస్వామి (వైకో), వి.అలగిరిస్వామి. ప్రస్తుతం సత్తూరు తాలూకా, సిప్పిపరై గ్రామానికి చెందిన రవిచంద్రన్ (యం.డి.యం.కే) 2008 సంవత్సరం వరకు శివకాశి యం.పి గా ఉన్నారు.
విరుదునగర్ జిల్లా నుండి యం.యల్.ఏ.లు గా ఎన్నికయినవారు:
డి.కే.రాజు, వి.వి.రామస్వామి, ఎస్.రామస్వామి నాయుడు, ఆర్.కృష్ణస్వామి నాయుడు, యమ.డి.రామస్వామి, యస్.పరమశివం, యస్.యస్.భారతి, ఎస్.రామస్వామి నాయుడు, పి.శ్రీనివాసన్, ఎస్.ఆర్.నాయుడు, సంజయ్ రామస్వామి, యం.జి.రామభద్రన్, యం.సౌందరరాజన్, యం.రామస్వామి, యన్.ఆర్.కృష్ణస్వామి నాయకర్, ఏ.ఆర్.ఆర్.శ్రీనివాసన్, ఆర్.శ్రీనివాసన్ నాయకర్, వి.బాలకృష్ణన్, కే.రామస్వామి, జే.బాలగంగాధరన్, ఏ.రాజగోపాల్, ఎస్.కే.రామస్వామి, యన్.వి.గురుస్వామి నాయుడు (అందిపట్టి), మునుస్వామి, జి.దళపతి మొదలైన వారు. ప్రస్తుతం ఆర్.జ్ఞానదాసు శివకాశి యం.యల్.ఏ. గా ఉన్నారు.
విరుదునగర్ జిల్లాలో కమ్మ ప్రముఖులు:
జస్టిస్. కే.వీరాస్వామి: జస్టిస్. కే.వీరాస్వామి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి గాను, ప్రధాన న్యాయమూర్తి గాను పని చేసారు. కమ్మవారిలో హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన వారిలో ఈయనే ప్రధములు. మద్రాస్ హైకోర్ట్ జడ్గిగా, పంజాబ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఆ తరువాత సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగ పనిచేసిన జుస్టిస్.వి.రామస్వామి వీరి కుమారుడే.
జస్టిస్.వి.రామస్వామి: జస్టిస్.వి.రామస్వామి మద్రాస్ హైకోర్ట్ జడ్గిగా, పంజాబ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఆ తరువాత సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పదవి విరమణ చేసారు. ఆ తరువాత ఈయన తమిళనాడు లా కమిషన్ చ్చైర్మన్ గా కొంత కాలం పనిచేసారు. జస్టిస్.రామస్వామి తనయుడు సంజయ్ రామస్వామి కొంతకాలం శివకాశి యం.యల్.ఏ (కాంగ్రెస్) గా ఉన్నారు. సంజయ్ ప్రసిద్ధ నటి శ్రీదేవి సోదరి శ్రీలత ను వివాహం చేసుకున్నారు.
శ్రీదేవి: ప్రఖ్యాత నటి శ్రీదేవి శివకాశి లో జన్మించింది. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ శివకాశిలో అడ్వకేట్, తరువాత మద్రాస్ కు మకాం మార్చారు.
జస్టిస్. కే.మోహనరాం: జస్టీస్.కే.మోహనరాం ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఈయన శివకాశి దగ్గరలోని వల్లంపట్టి గ్రామంలో జన్మించారు.
జస్టిస్.వెంకటస్వామి: మాజీ మద్రాస్ హైకోర్టు మరియు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్.వెంకటస్వామి విరుదునగర్ జిల్లా వారే.
జస్టిస్.జి.రామానుజం: జస్టిస్.జి.(చెరుకూరి)రామానుజం 1969-85 మధ్య కాలం, 16 సంవత్సరాలు మద్రాస్ హైకోర్టు జడ్జీగా పనిచేసారు. ఈయన ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రివిల్లిపుత్తూరు ప్రాంతానికి చెందిన వారు.
పి.శ్రీనివాసన్: తమిళనాడు అసెంబ్లీ డిప్యుటి స్పీకర్ గా 1967 లో ఎన్నికైన పి.శ్రీనివాసన్ ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అతి చిన్నవయసు (24 సంవత్సరాలు) లోనే, మొదటిసారిగా విరుదునగర్ నియోజకవర్గం నుండి డి.యం.కే అభ్యర్ధి గా పోటీ చేసి కాకలు తీరిన యోధుడు కామరాజ్ నాడార్ ను మట్టి కరిపించి, సంచలన విజయం సాధించాడు. ఈయన తెలుగు, తమిళ సినీ నటి వాసంతిని వివాహం చేసుకున్నారు.
వి. బాలచంద్రన్ IPS : ప్రముఖ హీరో రాజశేఖర్ బావ, శ్రీ.వి.బాలచంద్రన్ తమిళనాడు కమ్మవారి లో మొదటి IPS ఆఫీసర్. ఈయన తమిళనాడు DGP గా పదవి విరమణ చేశారు.
హీరో రాజశేఖర్: తెలుగు, తమిళ హీరో రాజశేఖర్ శివకాశి దగ్గర గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి వరదరాజులు చెన్నై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు గా పనిచేసి పదవి విరమణ చేశారు.



ఆత్మీయ సమావేశం...
No comments