BWF ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు సభ్యుడు మన స్థానిక బాలుడు తలసిల
భారత జూనియర్ బ్యాడ్మింటన్ జట్టులో 3rd seed గా ఉన్న తలసిల జ్ఞాన దత్తు, 2025 BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భారత తరపున పోటీపడ్డాడు.
మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ (సుహందినతా కప్) 2025 అక్టోబర్ 6 నుంచి 11 వరకు జరిగింది. ఈ పోటీలో భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించింది — తొలిసారిగా మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. సెమీఫైనల్లో భారత్ ఇండోనేషియాతో పరాజయం పొందినా, ఈ ప్రదర్శన భారత జూనియర్ బ్యాడ్మింటన్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
ఇందుకు తరువాత జరిగే వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌లు (ఐ-లెవల్ కప్) అక్టోబర్ 13 నుంచి 19, 2025 వరకు జరగనున్నాయి.
ఈ టోర్నమెంట్‌లో బాయ్స్ సింగిల్స్ విభాగంలో భారత ఆశలు ప్రధానంగా జూనియర్ ప్రపంచ ర్యాంక్ నం.14 రౌనక్ చోహాన్ మరియు 17 ఏళ్ల తలసిల జ్ఞాన దత్తు మీదే నిలిచాయి.
No comments