స్కాలర్షిప్స్ రూపంలో దాదాపు 25 లక్షల రూపాయలతో వందమంది పేద విద్యార్థుల కోసం కమ్మవారి సేవా సంఘం

 ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు నిలబెట్టడానికి సంకల్పించి స్కాలర్షిప్స్ రూపంలో దాదాపు 25 లక్షల రూపాయలతో వందమంది పేద విద్యార్థుల జీవితాన్ని నిలబెట్టారు ఆదివారం ఉదయం స్థానిక సాయి ఐటిఐ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మరియు బుల్లితెర నటుడు కమెడియన్ హైపర్ ఆది మరియు కమ్మ పెద్దలందరూ పాల్గొన్నారు...

కమ్మ వారి సేవా సమాఖ్య -ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మరియు ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘము అధ్యక్షులు మండవ మురళి కృష్ణ గారు మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంవత్సరానికి సరిపడా ఫీజు ని మరియు ఇతర అవసరాలకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా కమ్మ సేవా సంఘం అంటే కేవలం కమ్మ వారికి మాత్రమే కాదు ఇతర కులాల వారికి కూడా సహాయాన్ని అందించే విధంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను రాబోయే రోజుల్లో చేపడుతామని ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు...
కమ్మ సేవా సంఘం తరఫున ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకి మీరు అండగా ఉండటం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ గారు సంఘాన్ని అభినందించారు...
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేతలు మరియు విద్యార్థులు ప్రముఖులు వ్యాపారవేత్తలు కమ్మ సేవా సంఘం ప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు......



























No comments

మొదటి “కమ్మ సంఘం” ఎప్పుడు, ఎక్కడ ఏర్పడిందో మీకు తెలుసా?

మొదటి “కమ్మ సంఘం” ఎప్పుడు, ఎక్కడ ఏర్పడిందో మీకు తెలుసా? భారతీయ సమాజంలో అనేక కులాలు ఉన్నాయి. మన హిందూ మతం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ హిందూ...

Powered by Blogger.